‘రియా చక్రవర్తి కనబడుట లేదు’

బీహార్ డీజీపీ వెల్లడి

Rhea Chakraborty
Rhea Chakraborty

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి   రియా చక్రవర్తి కనపడకుండా పోయారని బీహార్ డీజీపీ తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు గురించి బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే  ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

 రియా చక్రవర్తి  ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని తెలిపారు.

సుశాంత్‌ మృతికి సంబంధించిన ఆధారాలను వారు సేకరిస్తున్నారని తెలిపారు.

ఇప్పటికే తాము సుశాంత్‌ సోదరితో పాటు సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, వంటమనిషి సహా పలువురిని ప్రశ్నించినట్లు చెప్పారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/