వర్మ ‘వ్యూహం ‘ ఫై మరో ట్వీట్

వివాదాస్పద చిత్రాలకు , ట్వీట్స్ కు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..గురువారం వ్యూహం అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధువారం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినా వర్మ..నెక్స్ట్ డే నే కొత్త చిత్రాన్ని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ‘నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు. కానీ రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి.’ అంటూ సినిమా తాలూకా వరుస ట్వీట్స్ చేసారు. ఈ ట్వీట్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకొనే వర్మ సినిమా చేయబోతున్నాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా అంత మాట్లాడుకుంటుండగానే శుక్రవారం మరో ట్వీట్ చేసారు వర్మ.

‘BJP ÷ PK x CBN – LOKESH + JAGAN = వ్యూహం’ అంటూ కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చారు. బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, జగన్‌ల ప్రస్తావన ఉంటుందని చెప్పకనే చెప్పారు. కూడికలు, తీసివేతలతో మరింత హైప్ పెంచారు. బీజేపీ ÷ పీకే X చంద్రబాబు- నారా లోకేష్+జగన్ అంటూ హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీతో పాటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్‌ల పేర్లను ప్రస్తావించారు. ఈ సినిమాలో విలన్ ఎవరు హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సినిమాల్లో టార్గెట్ చేసినట్లే.. మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను టార్గెట్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.