మొయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారం ఫై షబ్బీర్ అలీ కామెంట్స్

మొయినాబాద్ ఫాం హౌస్ వేదికగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండడంతో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పక్క ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు..తీరా గురువారం సిబిఐ కోర్ట్ సరైన ఆధారాలు లేవని నిందితులను వెంటనే విడుదల చేయాలనీ ఆదేశించింది.

ఇదిలా ఉంటె ఈ వ్యవహారం ఫై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పలు కామెంట్స్ చేసారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. 2014లో భైంసా ఎమ్మెల్యేను మొదటిసారి కొనుగోలు చేశారని , ఇప్పటివరకు 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అలాగే.. మరో తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇలా టీఆర్ఎస్, బీజేపీలు ఇద్దరు దొంగలేనని షబ్బీర్ అలీ విమర్శించారు. ఇక నిజాం నవాబులను మించి కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని అన్నారు.ఫామ్ హౌస్ లో పట్టబడిన నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లాల్సింది పోయి.. ప్రగతి భనవ్ కు ఎలా తీసుకెళ్తారని మండిపడ్డారు. పోలీసుల తీరును తాను ఖండిస్తున్నానని అన్నారు.