నేడు, రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన

వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో

అమరావతి: నేడు, రేపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం విశాఖ బయలుదేరనున్న చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల తరపున నేడు, రేపు ప్రచారం చేస్తారు. పెందుర్తి, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలలో రోడ్‌ షోలోనూ పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నిన్న భీమిలి గంట స్తంభం సెంటర్ నుంచి రోడ్డు షో నిర్వహించారు. లోకేశ్ రోడ్డు షోకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.

తాజా అంతర్జాతీయ కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/