రేపు నా బర్త్ డే..ఆలా అని ఎవరూ విష్ చేయకండి – వర్మ ఆసక్తికర ట్వీట్

సినిమాలకన్నా..నిత్యం ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలువడం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు వెన్నెతోపెట్టిన విద్య. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అనే ధోరణిలో ఉంటాడు. అవతలి వ్యక్తి ఎంతటివారైనా సరే ఏమాత్రం భయపడకుండా తాను చెప్పాలనుకున్నది..చేయాలనుకున్నది చేసేస్తాడు. తాజాగా రేపు తన బర్త్ డే అని ఆలా అని చెప్పి తనకు ఎవరు విష్ చేయకండి అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

” రేపు (7వ తేదీ) నా పుట్టిన రోజు. దయచేసి నాకు శుభాకాంక్షలు చెప్పకండి. విషెస్ అనేవి ఉచితం అయినవి, పనికి రానివి కూడా. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం” అంటూ వర్మ ట్వీట్ లో రాసుకొచ్చారు.