‘వారాహి’ రిజిస్ట్రేషన్ కు బ్రేక్ పడింది..

అంత అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ ‘వారాహి’ రిజిస్ట్రేషన్ కు బ్రేక్ పడింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్..ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా..పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఆదరణ పెరగడమే కాదు జనసేన ఫై నమ్మకం సైతం రెట్టింపు అయ్యింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ప్రజలు అంటున్నారు.

ఇక ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ..నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు. దసరా తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచార రథం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు.

‘వారాహి’ఈజ్‌ రెడీ ఫర్‌ బ్యాటిల్‌ అని ఎప్పుడైతే సోషల్‌ మీడియాతో ఫోటోలు పెట్టారో.. అప్పటి నుంచి బస్‌ యాత్ర వాహనం చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. తాజాగా.. వారాహి వెహికల్ రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. వాహనం ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం, మైన్స్లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం, లారీ చాసిస్ ను బస్సుగా మార్చడం వంటివి రూల్స్కు విరుద్ధమని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం సూచించింది. అంతేగాక ఆర్మీకి సంబంధించిన కలర్ను ఒక సివిల్ వాహనానికి ఉపయోగించకూడదని పేర్కొంది. ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలం అని ఆఫీసర్లు చెప్పడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి. మరోపక్క వాహన రిజిస్ట్రేషన్ పెండింగ్ పడడంతో వైస్సార్సీపీ నేతలు ఎలా కామెంట్స్ వేస్తారో చూడాలి.