వైట్‌ ఛాలెంజ్‌ కు రావాలంటూ కేటీఆర్ కు రేవంత్‌ రెడ్డి సవాల్‌

తెరాస – కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నుండి ఛాలెంజ్ ల యుద్ధం వరకు వెళ్లింది. మంత్రి కేటీఆర్‌ కు
రేవంత్ రెడ్డి వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. తాను రక్త పరీక్షలు ఇచ్చేందుకు సిద్ధమని..ఏ డాక్టర్‌ వద్దకు రమ్మన్నా తాను వస్తానని… మరీ… కేటీఆర్‌ మరియు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి దీనికి సిద్ధమా అని రేవంత్ సవాల్‌ విసిరారు. డ్రగ్స్‌ కేసుకు సంబంధం లేకపోతే… మంత్ర కేటీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మంత్రి కేటీఆర్‌కి డ్రగ్స్ వ్యవహారంతో లింకులు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. బెంగుళూర్ లో డ్రగ్స్ విచారణ చేస్తుంటే.. ఇక్కడి టీఅర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతోనే స్కూళ్లల్లో, కాలేజీల్లో, పబ్ లల్లో డ్రగ్స్ విచ్చల విడిగా వాడుతున్నారని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు వైట్ ఛాలెంజ్ లో భాగంగా అక్కడికి వస్తా అన్నారు. మీరు సిద్ధమా..నేను సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులను కోరుతున్నా. ప్రొహిబిషన్ అండ్ ఎక్స్ జ్ శాఖ.. రానా, రకుల్ కు నోటీసులు ఇవ్వాలి కానీ.. ఈడీ వారిని పిలిచి విచారిస్తుంది. దాని వెనుకున్న రహస్యమేంటన్నారు.