అఖండ నుండి అదిరిపోయే మెలోడీ సాంగ్ వచ్చింది

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ లుక్ టీజరే చెప్పేసింది.

గత కొద్దీ రోజులుగా చిత్ర అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తీపి కబురు తెలిపారు చిత్ర యూనిట్. ఈ మూవీ లోని ‘అడిగా..అడిగా’ అంటూ సాగే మెలోడీ పాటను శనివారం రిలీజ్ చేసారు. ఈ పాటను SP చరణ్ , M L శృతి ఆలపించగా..కల్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించారు. థమన్ మ్యూజిక్ అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

YouTube video