సైదాబాద్​ ఘటనపై రేవంత్​ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సైదాబాద్​ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి హత్యాచారంపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. సైదాబాద్​లో బాలిక కుటుంబాన్ని పరామర్శించని రేవంత్ రెడ్డి​.. వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఘటన జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

హత్యాచార ఘటనపై ఇంతవరకూ హోంమంత్రే స్పందించలేదని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. అప్పటివరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యువకులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడం దారుణమన్నారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి​ డిమాండ్​ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/