ముంబై లో సమంత ఓ భవనం కొనుగోలు చేసిందా..?

ముంబై లో సమంత ఓ భవనం కొనుగోలు చేసిందా..?

లేటెస్ట్ గా ఫిలిం సర్కిల్లో ఇదే మాట వినిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా సమంత పేరు మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి తన పేరు ముందు ఉన్న అక్కినేని అనే పదం తీసెయ్యడమే. ఏమాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇంట్రీ ఇచ్చిన ఈ భామ…ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని మరింత పాపులర్ అయ్యింది.

పెళ్లి తర్వాత చైతు – సామ్ ఏ రేంజ్ లో హడావిడి చేసారో తెలియంది కాదు..వీరిని చూసి చాలామంది ఈర్ష పడ్డారు కూడా. ఈ తరుణంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో సామ్ ఒంటరిగా కనిపిస్తోందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటె సమంత.. త్వ‌ర‌లోనే ముంబైకి షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ మేరకు అక్కడ ఓ భవనం కూడా కొనుగోలు చేసిందని అంటున్నారు. దీంతో స‌మంత ముంబైకి మ‌కాం మార్చాలనుకోవడం వెనుక‌ అసలు కారణం అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకోవడమేనా? లేక మరేదైనా ఉందా అనే కోణంలో సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి సమంత నిజంగానే ముంబైకి షిఫ్ట్ అవుతుందా అనేది ఆమె క్లారిటీ ఇవ్వాలి.