యాత్రలో హామీల వర్షం కురిపిస్తున్న రేవంత్

తెలంగాణ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ..కేసీఆర్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో ప్రజలకు తెలియజేస్తున్నారు.

తాజాగా మణుగూరులో రేవంత్ పాదయాత్ర జరిగింది..అక్కడ భారీ సభలో కీలక హామీలు ఇచ్చారు. ఎన్టీఆర్ 9 నెలల్లో ఎలా టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారో.అదేవిధంగా 9 నెలల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. అలాగే పోడు భూముల విషయంలో కే‌సి‌ఆర్ సర్కార్ పదే పదే మోసం చేస్తుందని, 9 ఏళ్ళు చేయలేనిది..9 నెలల్లో పోడు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షలు ఇస్తామని , గ్యాస్ సిలిండర్ రూ.500లకే అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మొత్తానికి రేవంత్ పాదయాత్ర చేస్తూ హామీలు ఇస్తూ వెళుతున్నారు.