రాష్ట్రంలో మరోసారి విద్యుత్​ ఛార్జీలు పెంచేందుకు కెసిఆర్‌ కుట్రః బండి

bandi-sanjay-comments-on-cm-kcr

హైదరాబాద్ః బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ జనగామ జిల్లా ఖిలాషపూర్ సమీపంలోని పాదయాత్ర శిబిరం వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారాన్ని మోపేందుకుసిఎం కెసిఆర్‌ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ తీరు వల్ల విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందన్నారు.

ఈ దుస్థితి నుంచి బయటపడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్​కు నిజంగా దమ్ముంటే.. డిస్కంలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు ఎన్నెన్ని బకాయిలున్నాయనే అంశంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు. కెసిఆర్​ది ఒకటే ఆలోచన అని.. ఈ రాద్ధాంతం చేసి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచే కుట్రకు సిద్ధమయ్యాడని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/