కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి విమర్శలు

Congress Leader Revanth Reddy
Congress Leader Revanth Reddy

‘కరోనా’ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోంది

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసారు. కరోనా నేపథ్యంలో కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోందని, కేసీఆర్ బంధువు డైరెక్టర్ గా ఉన్న ఫార్మా కంపెనీకి రూ.140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్ గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్ కి కొన్ని రోజులకే వందల కోట్ల రూపాయలు వచ్చాయని, ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం రూ.10 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. కాగా వేల కోట్ల రూపాయల ఎగుమతులు చేసే, లక్షల రూపాయల ట్యాక్స్ లు కట్టే ఫార్మా కంపెనీలకు కాకుండా ఇలాంటి అర్హత లేని కంపెనీతో ఒప్పందం ఎలా కుదిరింది? అని ప్రశ్నించారు. తన బంధువుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర పణంగా పెట్టి ఒప్పందం చేశారని ఆరోపించారు.

తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/videos/