హైకోర్టులో వికేంద్రీకరణ బిల్లు వాయిదా

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరావతి: ఏపి హైకోర్టులో సీఆర్డీఏ రద్దు, ఏపి రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కీలక విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు మనీ బిల్లు అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఐతే అది మనీ బిల్లు కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజి శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. ఐతే బిల్లు ఏ దశలో ఉందని సిజే అడగడంతో.. అసెంబ్లీలో పాసై మండలికి వెళ్లాయని, అక్కడి నుంచి సెలెక్ట్ కమిటీకి పంపించారని ఏజీ చెప్పారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సిజే .. ప్రస్తుతం ఈ బిల్లులపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వలు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం రాజధాని వికేంద్రీకరణపై దాఖలైన అని కేసుల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/