దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Y. S. Jaganmohan Reddy
Y. S. Jaganmohan Reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రపంచంలోనే అత్యుతత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటని అన్నారు. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్‌ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించదన్నారు. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/