భారత్‌ లక్ష్యం 133 పరుగులు

Team India
Team India

ఆక్లాండ్‌: ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతోన్న భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. మార్టిన్ గుప్తిల్ 33, కోలిన్ మున్రో 26, కానె విలియమ్సన్‌ 14, గ్రాంధోమ్మీ 3, రోస్ టెయిలర్ 18 పరుగులకు ఔటయ్యారు. టిమ్ సెయిఫెర్ట్ 33 (నాటౌట్), మిచెల్ శాంట్నర్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, శివమ్ దుబేలకు ఒక్కో వికెట్ దక్కాయి. మొదటి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/