తెదేపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

Amaravati: అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయడు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.. దేశ నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు..
చంద్రబాబు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు., దేశ నాయకుల సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేరస్థులు ముఖ్యమంత్రి అయి న్యాయ వ్యవస్థపైనే దాడిచేసే పరిస్థితికి వచ్చారని విమర్శించారు.
నేరస్థులు కోర్టులనే బెదిరించే పరిస్థితి వచ్చేసిందని, బుద్ది, జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి అయితే హైకోర్టు తీర్పు చూసైనా పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేవారు కాదన్నారు. న్యాయమూర్తులు, మారినా న్యాయం మారదని సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందన్నారు