జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్

Hyderabad/ Amaravati: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం జాతీయ పతకానికి గౌరవ వందనం చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం జాతీయ పతకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికపై తమ పార్టీ పోటీ చేయడంపై కూడా పూర్తి అవగాహనతో ఉందని ఆయన తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/