బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్‌

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత జనగామ జిల్లా జఫర్గడ్ మండలం పామునూరు నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే పాదయాత్ర జనగామ జిల్లా కూనూరు కు చేరుకోగానే ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్‌ పాదయాత్రలో​ బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.

దీంతో, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి ఉద్రిక్తతకు దారితీయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక, లాఠీఛార్జ్‌ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే..టీఆర్ఎస్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఓ వ్యక్తి బండి సంజయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బిజెపి కార్యకర్తలు అతడిని అడ్డుకొని చితకబాదారు.

హైకోర్టు అనుమతులతో పాంనూర్‌ నుంచి బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉప్పుగల్‌, కోనూర్‌, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది.