మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి తప్పు చేయలేదట..ఐటీ అధికారులు క్లారిటీ

రెండు రోజుల పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లలో వారి ఇళ్ల ఫై ఐటీ అధికారులు దాడులు చేయడం చిత్రసీమలో కలకలం రేపింది. హవాలా మార్గంలో నిధులు మళ్లించి ఆ నిధులను ప్రమోటర్లు మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడం తో పెద్ద ఎత్తున అధికారులు సోదాలు జరిపారు. కానీ వారికీ వచ్చిన సమాచారం లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసారు. మైత్రీ నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు ఉన్న ఎన్ఆర్ఐలుగా అధికారులు గుర్తించారు. కానీ ఎలాంటి తప్పుడు లావాదేవీలు గుర్తించలేదని తెలుస్తోంది.

ఏ సినిమాకు ఎంత ఖర్చు అయింది వాటి లాభాలు నష్టాలు ట్యాక్స్ లు ఎంత కట్టారు లాంటి అన్ని వివరాలు ఐటీ అధికారులు చూశారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వద్ద అన్ని ఆదాయ ఖర్చుల లెక్కలు సక్రమంగా ఉన్నాయని పన్నులు సరిగ్గానే చెల్లించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కార్యాలయాలతో పాటు నివాసాల్లోనూ జరిగిన సోదాల్లో ఎక్కడా అనుమానాస్పదంగా కనిపించకపోవడం తో అధికారులు వెళ్లిపోయారట. సోదాలు పూర్తి కావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారు వరుస భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు.