కస్టమర్ల కు బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో ..రూ.1 కే 100 ఎంబీ

ఈరోజుల్లో రూపాయికి ఏమిరావడం లేదు..కనీసం తాగే వాటర్ ప్యాకెట్ కూడా రాని ఈరోజుల్లో..జియో రూ. 1 కే 100 ఎంబీ ఇస్తున్నట్లు ప్రకటించి కస్టమర్లలో ఆనందం నింపారు. ప్రీపెయిడ్‌ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ని ఇచ్చి మరోసారి వార్తలో నిలిచింది జియో. రీసెంట్ గా టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో జియోఒక్క రూపాయికే ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత రిలయన్స్ కు మాత్రమే దక్కింది. అలాగే దీని వాలిడిటీ కూడా 30 రోజులని తెలిపింది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్‌ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట.