బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కు మెగా ఆఫర్..?

యూట్యూబర్ గా నెటిజన్లను ఆకట్టుకున్న షణ్ముఖ్ ..ప్రస్తుతం బిగ్ బాస్ షో తో మరింత పాపులర్ అయ్యాడు. ఈ వారం తో సీజన్ పూర్తి అవుతుంది. ఇక ఈ షో నుండి బయటకు వచ్చాక షన్ను కు మెగా ఛాన్స్ రాబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగినప్పటికీ.. షణ్ముఖ్‌ చాలా రోజులుగా ఇండస్ట్రీలో అవకాశం కోసం చూస్తున్నాడు. మధ్యలో కొన్ని ఛాన్సులు వచ్చినా కూడా చిన్న పాత్రలు కావడంతో నో చెప్పాడు.

బిగ్ బాస్ 5 తెలుగు తర్వాత ఈయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడంతో దర్శక, నిర్మాతలు షన్నూతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఆయన కోసం కొన్ని కథలు సిద్ధం చేసారని అంటున్నారు. త్వరలోనే షణ్ముఖ్‌ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు గట్టిగా చెపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే షన్ను ఫ్యాన్స్ కు పండగే.