రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

recycling-plant-inaugurated-by-minister-ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌ జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే పెద్ద ప్లాంట్‌ అని అన్నారు. ఎల్బీనగర్ ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.  హైదరాబాద్‌లో రోజుకు  2వేల టన్నుల భవన నిర్మణా వ్యర్థాలు వస్తున్నాయని, చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరో రెండు ప్లాంట్లను కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. మున్సిపల్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో  జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. 

వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌కు చెక్ పెట్టేందుకు బల్దియా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్ల‌తో క‌న్‌స్ర్ట‌క్ష‌న్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక‌, కంక‌ర‌ను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇసుక‌, కంక‌ర‌, ఇటుక‌ను పున‌ర్వినియోగ వ‌స్తువుగా మార్చేలా, గంట‌కు 50 ట‌న్నుల నిర్మాణ వ్య‌ర్థాల‌ను వేరు చేసేలా సీ అండ్ డీ ప్లాంట్‌ను నిర్మాణం చేశారు. ట‌న్ను నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ రుసుమును రూ. 342గా నిర్ధారించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/