రామరాజ్యాన్ని జగన్‌ నిర్మించారు

ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రనే మలుపుతిప్పింది.. కిల్లి కృపారాణి

రామరాజ్యాన్ని జగన్‌ నిర్మించారు
killi kruparani

అమరావతి: ఏపిలో ఎన్నికలకు ముందు సిఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రనే మలుపుతిప్పిందని వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్రలు చేయడం దేశ చరిత్రలోనే అరుదని చెప్పారు. ఆ ఘనత రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెల్లిందని అన్నారు. పాదయాత్ర తర్వాత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. రాష్ట్రంలో రామ రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే గొప్ప సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వంగా వైఎస్‌ఆర్‌సిపి నిలిచి పోతుందని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/