ఆ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ

Virat Kohli
Virat Kohli

ఇండోర్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. మరో పరుగు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధిస్తాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గనుక ఒక పరుగు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 పరుగుల్లో రోహిత్‌ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధించగా… విరాట్ కోహ్లీ 75 మ్యాచుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం. ఈ సిరిస్ నుంచి సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను దాటే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది. గువహటి వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో విరాట్ కోహ్లీ ఈ రికార్డుని మిస్సయ్యాడు. దీంతో ఇండోర్ వేదికగా మంగళవారం జరిగే రెండో టీ20లోనైనా కోహ్లీ ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/