తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి సోమవారం నాడు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సులు 36.30 లక్షల కిలోమీటర్లు తిరిగాయని, అందుకే ఈ స్థాయిలో ఆదాయం వచ్చిందని వివరించారు. దీంతో ఆర్టీసీకి ఏకంగా రూ.14.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో దసరా, బతుకమ్మ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే పండుగలు జరుపుకోవడం కోసం చాలామంది గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పండుగలు ముగించుకొని వారంతా తిరిగి వచ్చే క్రమంలో ఆర్టీసీపైనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అందుకే టీఎస్‌ఆర్టీసీకి భారీగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/