ఈవెనింగ్ స్నాక్స్
రుచి: వెరైటీ వంటకాలు

జీడిపప్పు బాల్స్
కావలసినవి: జీడిపప్పు-1కప్పు
పెసరపప్పు-పావు కప్పు (దోరగా వేయించుకోవాలి)
చిక్కటి పాలు- కప్పు, పంచదార- పాపు కప్పు
దాల్చిన చెక్కపొడి- కొద్దిగా, మిరియాల పొడి-చిటికెడు
కొబ్బరి కోరు-పావు కప్పు, నెయ్యి-2 లేదా 3 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం:
ముందుగా జీడిపప్పు, పెసరపప్పు మిక్సీబౌల్లో వేసుకుని, మరీ మెత్తగా పలుకులు పలుకులుగా ఉండేలా మిక్సీపట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లో పాలు- పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడ జీడిపప్పు- పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత దాల్చిన చెక్కపొడి, మిరియాల పొడి, కొబ్బరి కోరు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దగ్గరకు అయ్యేవరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త చలారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని, చిన్నచిన్న ఉండలుగా చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

స్వీట్ పొటోటా బజ్జీ
కావలసినవి- చిలగడదుంపలు-2 (పెద్దవి),
శనగపిండి-2 కప్పులు, బియ్యప్పిండి-4 టేబులు స్పూన్లు
కారం-1టీస్పూను, ఉప్పు-తగినంత
బేకింగ్ సోడా-చిటికెడునీళ్లు-సరిపడా, నూనె- డీఫ్రైకి సరిపడా
తయారు చేసేవిధానం:
ముందుగా చిలగడదుంపలను శుభ్రం చేసుకుని పై-తొక్కను పీల్తో తొలగించాలి. తర్వాత అడ్డంగా పలుచగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కో చిలగడదుంప ముక్కను అందులో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వే చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

మ్యాంగో కట్లేట్
కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు-2
ఉడికించుకోవాలి, ఉల్లిపాయ-1
పచ్చిమామిడికాయ- 1, పచ్చిమిర్చి-2 అల్లం-చిన్న ముక
కొత్తిమీర-2 రెమ్మలు, జీలకర్ర-అరటీ స్పూను,
దానిమ్మగింజలు- అరటీస్పూను, ధనియాలు-అరటీ స్పూను
మిరియాలు – 5, బ్రెడ్పీసులు-2 ఉప్పు- తగినంత
గుడ్డు-1, పాలు-3, టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌండర్-పావ్ఞ కప్పే
మొక్కజొన్న పిండి-2 టేబుల్స్పూన్లు నీళ్లు సరిపడా,నూనె-డీప్ప్రై
తయారు చేసేవిధానం:
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మామిడి కాయ అన్నీ ముక్కలుగా కట్ చేసుకుని, మిక్సీబౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బ్రెడ్ పీసులను చిన్నచిన్న ముక్కలు చేసి వేసుకోని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, కొత్తమీర, దానిమ్మ గింజలు, ధనియాలు, మిరియాలు, ఉప్పు వేసుకుని మరోసరి మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత ఆ మిశ్రమాన్నంతా ఒక బౌల్లో తీసుకుని అందులో మెత్తగా ఉడికిన బంగాళదుంపలను వేసుకుని బాగా కలుపు కోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు కూడా సుకుని ముద్దలా చేసుకోవాలి. అనంతరం రెండు బౌల్స్ తీసుకుని. ఒకదానిలో గుడ్డు-పాలు మరోదానిలో బ్రెడ్ పౌడర్- మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి.
ఇప్పుడు మామిడి- ఉల్లిపాయ మిశ్రమాన్ని చిన్నబాల్స్లా తీసుకుని నచ్చిన షేప్లో తయారు చేసుకుని వాటిని గుడ్డ-పాలు మిశ్రమంలో ముంచి, బ్రౌడ్ సౌండర్ ముక్కజొన్న పిండి బాగా పట్టించి నూనెలో
దోరగా వేయించుకోవాలి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/