కార్పొరేటర్ సింధుకు ప్రగతిభవన్ నుంచి పిలుపు!?
మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి

Hyderabad: టీఆర్ఎస్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి పేరు తెరపైకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చడం, మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా చేరుకోవడంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది.
భారతినగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలుపొందిన సింధుకు ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దీన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. బాబా ఫసీయుద్దీన్ బోరబండ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/