అరోమా తైలంతో ..

ఇంటింటి చిట్కాలు

benefits of aroma oil
benefits of aroma oil

ప్రకృతి నుంచి లభించే రకరకాల మొక్కల వేళ్లు, గింజలు, కాండం, పువ్వల నుంచి సేకరించిన నూనెలను అరోమా తైలాలంటాం.

వీటిలోని మేలు చేసే కొన్ని పదార్థాలు ముక్కు నుంచి మెదడుకు చేరి రక్తప్రసరణ, ఆలోచన కేంద్రాలు, ఊపిరితిత్తుల మీద పనిచేస్తాయి.

వీటిలో చెప్పుకోదగినవి:

నీలగిరి, జాజితైలాలు, వీటిలోని కొన్ని రకాల పదార్థాలు వాతావరణంలోని క్రిములను సంహరించడానికీ ఉపయోగపడతాయి. ఏ తైలం దేనికి, ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

నిద్రకు జాజి నూనె హాయి:

మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు వాడితే మంచి గుణం ఉంటుంది. గుండె పనితీరు పెంచుతుంది. ఒంటినొప్పులతో బాధపడేవారు కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

బకెట్‌ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది.

మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. అలానే నెలసరి సమయంలో కడుపునొప్పి అనిపిస్తే పొత్తికడుపుమీద రాస్తే మంచిది.

తల్లో పేలు బాధిస్తుంటే:

కొబ్బరినూనెలో జాజితైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు. చెంచా పాలమీగడలో నాలుగుచుక్కలు చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి.

జాజి తైలం జాగ్రత్తలు :

ఈ తైలాన్ని కొబ్బరి, ఆలివ్‌నూనె, తేనె ఏదో ఒకదానితో కలిపి కొంచెం వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సుగంధ తైలాల వాడకంలో వీటిని ఇతర నూనెలతో కలిపి వాడుకోవాలి.

ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి పరిమితంగా వాడాలి. ఉప్పు, నూనె, ఏదైనా పిండిలో కానీ వేసి వాడుకోవాలి. సుమారు పది నుంచి పన్నెండు చుక్కలు మించి వాడకూడదు.

చిన్నారులు, వాసన పడనివారు వీటికి దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఈ నూనె వల్ల గర్భస్రావమయ్యే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి గర్భిణులు వాడకపోవడం మేలు.

కొందరికి పడక తలనొప్పి, వాంతుల సమస్యలు బాధిస్తాయి. కాబట్టి గమనించి ఉపయోగించాలి.

నీలగిరితో నొప్పులు దూరం: కప్పు నీళ్లలో ఆరుచుక్కల నూనె కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాధించవు.

జ్వరంతో బాధపడేవారికి చల్లటినీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగిరి తైలం వేసి ఒంటిని తడిపితే త్వరగా తగ్గుతుంది.

జలుబు, దగ్గు, సైనస్‌ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తోంటే చేతిరుమాలులో నాలుగు చుక్కలు వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది.

చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పడుతుంటే ఆరు నుంచి పదిచుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి.

ఫ్లూజ్వరం ఉన్నవారికి నీళ్లలో రెండు,మూడు చుక్కలు కలిపి తాగిస్తారు.

కండరాల నొప్పి, నరాలు పట్టుకుపోయినప్పుడు కొబ్బరినూనెలో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్య దూరమై హాయిగా ఉంటుంది.

నల్లులు, పురుగులను నిర్మూలించాలంటే నీలగిరి తైలాన్ని, టర్పెంటైన్‌ తైలంలో కలిపి అందులో చిన్నచిన్న కాటన్‌ ఉండలు వేసి బయటకు తీసి వాటిని మంచాల మూలల్లో, దుస్తుల అల్మరాలో పెడితే వాటి బెడద తగ్గుతుంది.

నీలగిరి తైలాన్ని తేనెలో కలిపి మొటిమల మీద రాస్తే అవి త్వరగా మాని పోతాయి. అయితే ఆరేళ్లలోపు చిన్నారు లకు నోటి ద్వారా ఇవ్వకూడదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/