పోషకాలు ఎక్కువగా అందాలంటే!
ఆహారం- ఆరోగ్యం

కూరగాయలను పిచ్చగా తింటే మంచిదా! ఉడికించి తింటే మంచిదా! లేదా జ్యూస్ చేసుకొని తాగితే మంచిదా! అనే సందేహం మనలో చాలామందిలో ఉంటుంది. వీటిలో ఏ రూపంలో తిన్నా మంచిదే.
అయితే జ్యూస్ చేసుకొని తగితే ఎక్కువ లాభం అంటున్నారు న్యూట్రిషనిస్ట్, క్లినికల్ డైటీషియన్ పూజా మఖీజా. శరీరం వీటిని ఎలా గ్రహిస్తుందనే విషయాన్ని ఈమధ్యే ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరించారు. ఆమె ఏం చెబుతున్నారంటే..
కూరగాయల్లో ఉండే పోషకాలలో చాలావరకు నీటిలో కరిగే విటమిన్లే. ఆక్సిడేషన్ (గాలిలోని ఆక్సిజన్‌తో చర్య పొందడం) వల్ల విటమిన్లు తొందరగా నశిస్తాయి. కూరగాయలను ముక్కలుగా కోసే క్రమంలో వాటిలోని కొన్ని పోషకాలు పోతాయి.
అదే విధంగా కూరగాయలను పండుతున్నప్పుడు ఆక్సిడేషన్, వేడి కారణంగా వాటిలోని మరికొన్ని పోషకాలు నశిస్తాయి. అంతేకాదు పచ్చి కూరగాయలను నమలడం, ఉడికించి తినడం వల్ల వాటిలోని లవణాలు, విటమిన్లు ఆలస్యంగా విడుదల

అదే విధంగా కూరగాయలను పండుతున్నప్పుడు ఆక్సిడేషన్, వేడి కారణంగా వాటిలోని మరికొన్ని పోషకాలు నశిస్తాయి. అంతేకాదు పచ్చి కూరగాయలను నమలడం, ఉడికించి తినడం వల్ల వాటిలోని లవణాలు, విటమిన్లు ఆలస్యంగా విడుదల అవుతాయి
దాంతో శరీరం వాటిని శోషణ చేసుకోవడం కూడా ఆలస్యం అవుతుంది. అలాకాకుండా వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల పోషకాలు. విటమిన్లు ఎక్కువగ్శాఅందుతాయి. శరీరానికి అందాల్సిన పోషకాలు చాలా తొందరగా లభిస్తాయి.
ఒకే రకం అని కాకుండా పలు రంగుల్లో ఉండే కూరగాయల నుంచి రసం తీసి తాగితే పలు రకాల పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా రోజుకు ఒక గ్లాసు కూరగాయల రసం తాగడం అలవాటు చేసుకోవాలి.
ఇలా చేస్తే రెండు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. కురులు చర్మం ఆరోగ్యంగా మారతాయి. రోగనిరోధకశక్తి, ఉత్సా హం పెరుగుతుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/