మోడీ గడ్డం వెనుక కథ ఇదేనట!

కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా విషయాలను నేర్చుకున్నారు. యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో ప్రజలు నానా కష్టాలు పడ్డారు. సామాజిక దూరాన్ని పాటించడం మొదలుకొని, ఇతరులకు సాయం చేసేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. ఇక కరోనా సోకకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారు. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమయంలో గడ్డం పెంచుతూ కనిపించాడు.

మోదీ ఈ విధంగా గడ్డం పెంచుకోవడంతో ఆయన ఎందుకిలా చేస్తున్నాడా అని పలువురు అన్నారు. కరోనా కారణంగా మోదీ ఈ విధంగా గడ్డం, జుట్టు పెంచుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ గడ్డం పెంచడానికి అయోధ్య రామమందిర నిర్మాణం ఉందని తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన మోదీ, ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు ఇలా గడ్డం, జుట్టు కత్తరించకూడదని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ అన్నారు.

ఇలాంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలను తొలగించకూడదు. ఇది హిందూ సనాతన ధర్మంలో భాగమని ఆయన అన్నారు. దీంతో మోదీ గడ్డం, జుట్టు పెంచడం వెనుక ఉన్న అసలు విషయం ఇదే కావచ్చని పలువురు అంటున్నారు. ఏదేమైనా మోదీ గడ్డం, జుట్టుపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.