ఏఆర్ రెహమాన్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన ప్రముఖులు

ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన తన సంగీతంతో చేసిన మ్యాజిక్ కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ వచ్చింది. కాగా తాజాగా ఏఆర్ రెహమాన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెహమాన్ తల్లి కరీమా బేగం అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీనికి సంబంధించి రెహమాన్ ఆయన తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కస్తూరి శేఖర్‌గా జన్మించిన ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు రాజగోపాల కులశేఖరన్‌ను వివాహమాడారు. కాగా ఆమె తన పిల్లలు చిన్నతనంలో ఉండగానే భర్త మృతిచెందడంతో వారి కోసం చాలా కష్టపడింది. ఈ క్రమంలో తాను సంగీత దర్శకుడిగా మారేందుకు ఆమె ప్రోత్సాహం చాలా ఉండేదని రెహమాన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. శేఖర్ కన్నుమూసిన పదేళ్ళ తర్వాత వీరి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించింది.

అయితే తన తల్లి ఆరోగ్యం కుదుటపడుతుందని రెహమాన్ ఆశించాడు. కానీ ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో కరీమా బేగం ఆత్మకు శాంతి కలగాలని, రెహమాన్‌కు పులువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.