గూగుల్ సాక్షిగా కేజీఎఫ్ చిత్రంలో బాలయ్య

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. కాగా ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ 2 కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలుగు ప్రేక్షకుల కు కూడా ఇప్పటివరకు తెలియదు. కానీ ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో కేజీఎఫ్ 2 చిత్రంలో బాలయ్య నటిస్తున్నట్లు చూపిస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సినిమాలో బాలయ్య కూడా నటిస్తున్నాడా అంటూ వారు నోరెళ్లబెట్టారు.

మొత్తానికి కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీలో బాలయ్య నటిస్తే ఆ సినిమా రేంజ్ వేరే ఉంటుందని నందమూరి అభిమానులు అంటున్నారు. కానీ బాలయ్య ఈ సినిమాలో నటించడం లేదని, మరి గూగుల్‌లో ఎందుకు అలాగ చూపిస్తుందని వారు అంటున్నారు. ఏదేమైనా కేజీఎఫ్ 2 చిత్రంలో బాలయ్య నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.