భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను చవిచూశాయి. ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచీ కూడా సూచీలు గ్రీన్ లోనే కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్ల లాభాలను కూడా చూసింది. అయితే, చివరికి 359 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,300 వద్ద ముగియగా.. 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,738 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.06 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/