ఐఐటిలో లా చదవండి

ఎల్‌ఎల్‌బి ప్రవేశాలకు ప్రకటన విడుదల

Career

ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌, మెడిసిన్‌, లా కోర్సులను ఐఐటి ఖరన్‌పూర్‌ ఎన్నాళ్ల నుంచో నిర్వహిస్తోంది. ఈ సంస్థ అందించే ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఇతర లా కోర్సులు దేశవ్యాప్తంగా పేరు పొందాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో క్యాంపస్‌ నియామకాల్లో ఎంపికవుతున్నారు. తాజాగా వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎల్‌ఎల్‌బి: ఎల్‌ఎల్‌బిలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీరైట్స్‌ మూడేళ్ల లా కోర్సును రెసిడిన్షియల్‌ విధానంలో ఐఐటి ఖరన్‌పూర్‌ అందిస్తోంది. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సులో చేరినవారిని న్యాయవిద్యతో పాటు సైన్స్‌, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు.

అర్హత: ప్రథమశ్రేణి మార్కులతో ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పిజిలో ప్రథమ శ్రేణి మార్కులతో సైన్స్‌/ ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబిఎతోపాటు ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌లో యూజీ లేదా సైన్స్‌/ ఫార్మసీలో పిజి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ప్రతిభ ద్వారా

పరీక్ష తీరు: 200 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి రెండు గంటలు. ఇండులో ఇంగ్లీష్‌ 60చ లాజికల్‌ రీజనింగ్‌ 20చ మ్యాథమేటికల్‌ ఎబిలిటీ 15, బేసిక్‌ సైన్స్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్‌ సైన్స్‌) 35, లీగల్‌ ఆప్టిట్యూట్‌ 70 మార్కులకు ఉంటాయి.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.

ఎల్‌ఎల్‌ఎం: కార్పొరేట్‌ లా, కాంపిటిషన్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, కాన్‌స్టిట్యూషనల్‌లా, టాక్సేషన్‌, క్రిమినల్‌ లా అండ్‌ జస్టిస్‌, ఇంటర్నేషనల్‌ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. అర్హత: మూడేళ్లు లేదా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బి లేదా బిఎల్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు 55శాతం మార్కులతో ఉత్తీర్ణత.

పరీక్షలో: లీగల్‌ ఆప్టిట్యూడ్ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.

దరఖాస్తులు: ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం రెండు కోర్సులకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16. పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 18.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 19, పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/