ఐఐఎం కోల్‌కతా: సప్లైచైన్‌లో కోర్సు

Career

ఎక్కడో విదేశాల్లో తయారవుతున్న వస్తువులను కూడా మనం వినియోగిస్తున్నాం. ఇదెలాసాధ్యమని అనిపించిందా? వస్తువు తయారవడానికి ముడిసరుకును ఫ్యాక్టరీకి తరలించడం నుంచి వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశలుంటాయి. అందుకు అవసరమైన సమన్వయయే సప్లైచైన్‌ మేనేజ్‌మెంట్‌. తయారీ, సేవారంగాల్లో ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది.

ఆసక్తి ఉన్నవారికి ఇదొక మంచి కెరియర్‌గానూ ఉపయోగపడుతుంది. ఐఐఎం కోల్‌కతా సప్లైచైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశ ప్రకటన వెలువడిన సందర్భంగా ఈ కోర్సు విశేషాలతో వ్యాపార రంగంలో ఉన్న తీవ్రపోటీ నేపథ్యంలో లాజిస్టిక్స్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్ల పాత్ర గణనీయంగా పెరిగింది. వస్తువులను సకాలంలో వినియోగదారుడికి చేరేందుకూ, వారితో మంచి సంబంధాలు పెంచుకోవడానికి ఇవి తోడ్పడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా సంబంధిత కోర్సులు చదవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు.

ఐఐఎంసీ, హుగ్స్‌ గ్లోబల్‌ఏడ్యుకేషన్‌ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయి. కోల్‌కతాలోని ఐఐఎంకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వ్యాపారంగంలో ఆయా విభాగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపర్చడమే దీని లక్ష్యం. ఇది పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనింగ్‌, రీసెర్చ్‌ అండ్‌ కన్సల్టింగ్‌, డాక్టొరల్‌ ప్రోగ్రామ్స్‌ను ఆందిస్తోంది. హుగ్స్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఉద్గోగాలకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.

ఇది దేశంలో ఉన్న ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ ఐఐటి అహ్మదాబాద్‌ ఐఐఎంసి, ఐఐఎఫ్‌టి న్యూఢిల్లీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జమ్‌షద్‌పూర్‌, ఇన్‌సోఫ్‌లతో సంయుక్తంగా వివిధ మార్కెటింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది.

అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, వినియోగదారుడికి తన కోరుకుంటున్న దాన్ని త్వరగా చేరవేసేందుకు సప్లై చైన్‌ వ్యూహం ముఖ్యమైనది. ఈ కోర్సు దానికి అనుగుణంగా కొత్త ఆలోచనలతో కూడిన స్ట్రాటజీ ప్లానింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఆపరేషన్స్‌, అకౌంటింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, ఎకనామిక్స్‌ తదితరాల అన్నింటిపై అవగాహన పెంచుకోవచ్చు. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలను బృందంతో కలసి పరిష్కరించే సామర్ధ్యాన్ని పొందవచ్చు.

అర్హత: ఎంపిక విధానం:

ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ లాజిస్టిక్‌, సిస్టమ్‌ అన్ని విభాగాల్లో రెండు సంవత్సరాలు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష, ప్రొఫైలింగ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/