ఓల్ట్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభం

సీపీఐ అభ్యర్థి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రణ
అభ్యర్థి గుర్తించడంతో నిలిచిపోయిన పోలింగ్

Repoll for Old Malakpet ward

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయిన ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో నేడు రీపోలింగ్ జరుగుతోంది. ఇక్కడి డివిజన్ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్ ప్రారంభమయ్యాక దీనిని గుర్తించిన పార్టీ అభ్యర్థి విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలింగ్ నిలిపివేశారు. దీంతో 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

రీపోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, మొత్తం 54,655 మంది ఓటర్లున్నారు. మొన్నటి పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేయడంతో నేడు మధ్య వేలికి వేయనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/