చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేతః హైకోర్టు

high-court-dismissed-chandrababu-quash-petition

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

కాగా, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్దార్థ్ లోథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా క్వాష్ పిటిషన్ పై సీఐడీ వాదనలను ఏకీభవించి హైకోర్టు. చంద్రబాబు కస్టడికి సంబంధించిన పిటిషన్ మరో గంట సేపట్లో తీర్పు వెల్లడికానుంది. ఈ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. క్వాష్ పిటిషన్ తీర్పు కోసమే ఏసీబీ కోర్టు ఎదురుచూసింది. తాజాగా ఈ పిటిషన్ తీర్పు ఇలా ఉండటంతో ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి మరీ.