రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ

4.4 శాతంగా ఉన్న రెపో రేటును 4.9 శాతానికి పెంపు
పెంచిన వ‌ర్డీ రేట్లు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్న ఆర్బీఐ

ముంబయి: వ‌డ్డీ రేటును పెంచుతూ ఆర్బీఐ బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం ముంబయిలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆర్బీఐ గ‌వర్న‌ర్ శక్తికాంత దాస్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెపో రేటును 50 బేసిక్ పాయింట్లు పెంచుతున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం రెపో రేటు 4.4 శాతంగా ఉంది. దీనిని 4.9 శాతానికి పెంచుతున్న‌ట్లుగా శ‌క్తికాంత దాస్ ప్ర‌క‌టించారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేపడుతున్నామ‌ని, ఇందులో భాగంగానే వడ్డీ రేటును పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. పెంచిన వ‌డ్డీ రేట్లు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తాయ‌ని కూడా ఆయ‌న ప్ర‌కటించారు. ఏప్రిల్‌, మే నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం స్థిరంగానే ఉంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/