Game Changer : ‘జరగండి’ వచ్చేసింది..ఎలా ఉందో చేసెయ్యండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా గేమ్ ఛేంజర్ టీమ్ అభిమానులకు మెగా గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ‘జరగండి’ (Jaragandi ) అనే సాంగ్ ను చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసారు.

భారీ సెట్టింగ్స్, విజువల్స్ తో సాంగ్ గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ లుక్ సూపర్ గా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ సాంగ్ రిలీజ్ తో పండగ చేస్కుంటున్నారు. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందజేయగా..ప్రభుదేవా కొరియో గ్రఫీ చేసారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి రాజకీయన నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ పాత్రలోనూ నటిస్తున్నారు.

YouTube video