శివశంకర్ మాస్టర్ కు ఆర్ధిక సాయం చేసిన చిరంజీవి

శివశంకర్ మాస్టర్ కు ఆర్ధిక సాయం చేసిన చిరంజీవి

కరోనా తో పోరాడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం అందించారు. రీసెంట్ గా శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈయన తో పాటు పెద్ద కుమారుడు , భార్య ఇలా అంత కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరి బాగోగులు చిన్న కుమారుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి చాల విషమంగా ఉంది. దాదాపు 75 శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు శివశంకర్ మాస్టర్ కు లక్షల్లో ఖర్చు అవుతుండడం తో..తన కుటుంబాన్ని ఆదుకోవాలని చిన్న కుమారుడు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. దీంతో పలువురు ఆర్ధిక సాయం అందజేస్తూ వస్తున్నారు.

తాజాగా శివశంకర్ మాస్టర్ చికిత్స నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ శివశంకర్ కు ఈ చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇటీవలే శివశంకర్ మాస్టర్ ఆచార్య సెట్స్ వద్దకు వచ్చారని, ఆయనతో మాట్లాడానని వెల్లడించారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, దేవుడు తప్పకుండా ఆయన కోలుకునేలా చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ స్పందిస్తూ, చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఈ కష్టసమయంలో చిరంజీవి అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని అన్నారు.