అన్నయ్య మూవీ సెట్ లో పాల్గొన్న రవితేజ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో బాబీ సినిమా ఒకటి. చిరు 154 మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని మాస్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అప్పుడెప్పుడో అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన రవితేజ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు అనగానే మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఇక నేడు ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ ని హైదరాబాదులో మొదలుపెట్టగా అందులో రవితేజ కూడా పాల్గొన్నాడు. ఒక వారం రోజులు వరకు చిరంజీవి రవితేజకు సంబంధించిన సన్నివేశాలను కంటిన్యూగా షూట్ చేయబోతున్నారట. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.