అయ్యన్న పాత్రుడిపై విజయసాయి దారుణమైన వ్యాఖ్యలు

vijayasai-reddy

వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి అయ్యన్న పాత్రుడి ఫై పలు వ్యాఖ్యలు చేసారు. పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు అంటూ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. సభ , సమావేశాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ-వైస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా రీసెంట్ గా అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం ఫై టీడీపీ నేతలు , కార్య కర్తలు వైసీపీ ఫై ఆగ్రహంగా ఉన్నారు.

ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని నర్సీపట్నం వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరిన అయ్యన్న కు, టైము డేటు చెప్పాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక అయ్యన్నపాత్రుడుని పిల్లి అంటూ, కానీ పులి లాగా ఫీల్ అవుతారని విమర్శలు చేశారు. అయితే దానికి అయ్యన్నపాత్రుడు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటాను అంటూ పేర్కొని, 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిన్న సాయిరెడ్డి అక్కడ తోటి ఖైదీలు, జైలు అధికారులు కొట్టన దెబ్బల చారలు చూసి పులిగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పులి అయితే పోలీసులు లేకుండా సింగిల్ గా రావాలని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

ఈ క్రమంలో విజయసాయి మరో ట్వీట్ చేశారు. పులులు ఎప్పుడూ పందులతో పోటీ పడవు అన్న సాయిరెడ్డి పులులెప్పుడూ పందులతో పోటీ పడవు అంటూ అయ్యన్నపాత్రుడు ని పంది తో పోల్చారు. పులి లాగ ఉండేవారు అర్ధరాత్రి కోర్ట్ స్టేలు తెచ్చుకోరని, బీసీలపై కక్ష సాధింపంటూ ఆక్రందనలు చేయరని టార్గెట్ చేశారు. మాటిమాటికి గంజాయి పాత్రుడూ అంటూ అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి దాన కర్ణుడినంటావ్. 2 సెంట్లు కూడా వదలక కబ్జా చేశావ్ అంటూ మండిపడ్డారు. ‘నీ బతుకే గంజాయి. అది పీల్చి పీల్చి పిచ్చెక్కి వాగుతూ పోలీసులు వస్తే నక్కలా నక్కుతున్నావ్ అంటూ అయ్యన్నపాత్రుడు ని తిట్టిపోశారు. అక్కడితో ఆగకుండా అంతేకాదు భోగాపురం రిసార్ట్ లో భోగం మేళాలు పెట్టుకునిఅశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు – పెగ్గుంటే చాలు అంటూ తీవ్ర పదజాలంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోటికొచ్చినట్టు తిట్టారు.