కార్యకర్త కుటుంబానికి పవన్ పరామర్శ

‘జనసేన’ తరపున రూ. 8.50 లక్షల ఆర్థిక సాయం

Pawan kalyan
Pawan kalyan

Ongole: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటనకు విచ్చేసారు . ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌‌ ‘జనసేన’ కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.

అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు.

గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని , ప్రశ్నించినందుకే వెంగయ్యను హతమార్చారని ఆయన ఆరోపించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/