‘మాచర్ల నియోజకవర్గం’ లో రాజప్పగా సముద్రఖని..

మాచర్ల నియోజకవర్గం నుండి మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ప్రమోషన్ ను మొదలుపెట్టారు.ఇప్పటికే పలు స్టిల్స్ , టీజర్ , సాంగ్స్ విడుదల కాగా..తాజాగా సినిమాలోని సముద్రఖని లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

ఈ సినిమాలో, ‘రాజప్ప’గా సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. నెరసిన జుట్టు .. గుబురు మీసాలుతో కాస్త వయసు మళ్లిన పాత్రలో .. ఊరికి పెద్దమనిషి అనుకునే తరహాలో కనిపిస్తున్నాడు. తెలుగులో సముద్రఖని పాత్ర కోసం ఈ స్థాయిలో డిఫరెంట్ లుక్ తో కనిపించడం ఇదే మొదటిసారి. ఆయన లుక్ ను బట్టి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా… ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.