రవిబాబు నుండి వస్తున్న ‘అసలు’

నటుడు , డైరెక్టర్ రవిబాబు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన..డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్నాడు. కామెడీ సినిమాలతో పాటు హర్రర్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు అసలు పేరుతో రాబోతున్నాడు. నటి పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ..ఈ నెల 13వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్స్ లలో కాకుండా నేరుగా ఓటిటి లో రిలీజ్ చేయడం విశేషం.

అందుకు సంబధించిన ట్రైలర్ ను కొంతసేపటికి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రొఫెసర్ చక్రవర్తి మర్డర్ మిస్టరీ కేసును ఛేదించడానికి రవిబాబు రంగంలోకి దిగుతాడు. ఈ కేసు విషయంలో నలుగురు వ్యక్తులపై ఆయనకి అనుమానం కలుగుతుంది. ఆ నలుగురు ఎవరు ? ‘అసలు’ హంతకులు ఎవరు? అనేదే కథ. ఈ సినిమాకి రవిబాబు రచయితగా .. నిర్మాతగా వ్యవహరించగా, ఉదయ్ – సురేశ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

YouTube video