100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన మాస్ రాజా ధమాకా

మాస్ రాజా అభిమానుల కోరిక నెరవేరింది. నిన్న , మొన్న వచ్చిన చిన్న చిన్న హీరోలు 100 కోట్ల క్లబ్ లో అడుగుపెడుతున్నారు.. ఆ హీరో ఎప్పుడు అడుగుపెడతాడో అని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ధమాకా మూవీ తెరదించింది.

రవితేజ – నక్కిన త్రినాద్ కలయికలో వచ్చిన ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసి అభిమానుల్లో సంతోషం నింపింది. క్రాక్ తర్వాత ఒక్క హిట్ కూడా లేక రవితేజ తో పాటు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ధమాకా వచ్చి బ్లాక్ బస్టర్ కావడం అందరిలో సంతోషం నింపింది. గత నెల 23 న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..మొదటి ఆట తో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, చాలా వేగంగా 90 కోట్లను రాబట్టింది. అక్కడి నుంచి కాస్త నెమ్మదించింది. నిన్నటితో ఈ సినిమా 14 రోజులను పూర్తిచేసుకుంది. 14వ రోజుతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది.

ఫ‌స్ట్ డే రూ.10 కోట్లు.. రెండో రోజుకు రూ. 19 కోట్లు.. మూడో రోజుకు రూ. 32 కోట్లు.. నాలుగో రోజుకు రూ.41 కోట్లు.. 5వ రోజుకు రూ. 49 కోట్లు .. 6వ రోజు.. రూ. 56 కోట్లు.. 7వ రోజు (ఫ‌స్ట్ వీక్‌) రూ.62 కోట్లు.. 8వ రోజు రూ.69 కోట్లు..9వ రోజు.. రూ.77 కోట్లు.. 10వ రోజు.. రూ.89 కోట్లు.. 11వ రోజు.. 94 కోట్లు.. 12వ రోజు.. రూ.96 కోట్లు.. 13వ రోజు రూ.98 కోట్లు రాగా.. 14వ రోజు ధ‌మాకా మూవీ రూ.100 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ మార్కును దాటేసింది. ఇక రవితేజ కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్ అని మార్కెట్ వ‌ర్గాల స‌మాచారం. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. రావు ర‌మేష్‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.