మాస్ రాజా రవితేజ ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ

మాస్ రాజా రవితేజ సినీ ఎంట్రీ ఎలా ఉందో ..ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగారో చెప్పాల్సిన పనిలేదు. చిత్రసీమలో రాణించాలంటే సినీ బ్యాక్ గ్రౌండ్ అనేది అవసరం. ఆలా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఛాన్సులు వస్తాయి. అలాంటిది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన నటనతో చిత్రసీమలో అడుగుపెట్టి..చిన్న చిన్న వేషాల నుండి ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు రవితేజ. ఏడాదికి కనీసం రెండు , మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ..ప్రతి రోజు సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉంటాడు రవితేజ. అలాంటి రవితేజ ఫ్యామిలీ నుండి ఇప్పుడు మరో హీరో చిత్రసీమ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రంలో మాధవ్ హీరోగా నటిస్తున్నాడు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్‌గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు ‘గౌరీ రోణంకి’ ఈ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ మూవీ కి సంబదించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.