డిజిటల్ కరెన్సీపై బాపూజీ బొమ్మ లేకపోవడం పట్ల గాంధీ ముని మనవడు అసంతృప్తి

డిజిటల్ కరెన్సీపై బాపూ బొమ్మను వేయకపోవడంపై ధన్యవాదాలు అంటూ ట్వీట్

‘Remove Bapu’s image from notes to,’ Mahatma Gandhi’s kin fumes

న్యూఢిల్లీః ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ రూపీ)ని ఆర్ బీఐ విడుదల చేసింది. దీన్నిరిటైల్, హోల్ సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా కొన్ని పట్టణాల్లో పరీక్షిస్తున్నారు. ఈ రూపీపై మహాత్మా గాంధీ ఫొటో లేకపోవడంతో గాంధీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యంగ్య ధోరణిలో వ్యక్తం చేశారు.

‘‘ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై బాపూ బొమ్మ వేయనందుకు ఆర్ బీఐకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు దయ చేసి ఆయన ఫొటోని పేపర్ కరెన్సీపైనా తొలగించండి’’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తుషార్ గాంధీ ట్వీట్ పై కేంద్ర సర్కారు స్పందిస్తుందో, లేదో చూడాల్సి ఉంది. కానీ ఎక్కువ మంది ట్విట్టర్ యూజర్లు తుషార్ గాంధీకి వ్యతిరేక కామెంట్లు చేయడం గమనించొచ్చు. ‘ఒక్క గాంధీ ఫొటోనే ఎందుకు వేయాలి సర్.. ఆ మాటకొస్తే కరెన్సీ నోట్లు, కాయిన్లపై అందరు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను వేయాల్సిందే’ నంటూ ఓ యూజర్ స్పందించాడు.

పేపర్ కరెన్సీ వినియోగానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీని సీబీడీసీ (ఈ-రూపీ) పేరుతో ఆర్ బీఐ తీసుకొచ్చింది. దీనివల్ల ఎన్నో వ్యయాలు ఆదా అవ్వడంతోపాటు, నగదు నిర్వహణ రూపంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల డినామినేషన్లలో ఈ-రూపీ కూడా అందుబాటులోకి రానుంది. ఈ రూపీ వచ్చినా భౌతిక కరెన్సీ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/