కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున నిల్చున్న అభ్యర్థిని కాదని తన తమ్ముడికి ఓటు వేయాలని కోరడం, మునుగోడు లో కాంగ్రెస్ గెలవదని చెప్పడం పట్ల కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా నడుస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని ప్రధాన పార్టీల నేతలు మునుగోడు లో ప్రచారం చేస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి బరిలో నిల్చుంది. అగ్ర నేతలు ప్రచారానికి పెద్దగా రాకపోయినప్పటికీ స్థానిక నేతలతో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఎన్నికకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ప్రచారానికి రాకపోగా..బిజెపి అభ్యర్థి గా నిల్చున్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ కార్య కర్తలకు ఫోన్ చేసి చెప్పడం, అలాగే కాంగ్రెస్ మునుగోడు లో గెలవదని , గెలవని పార్టీకి నా ప్రచారం అవసరం లేదని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీని పట్ల కాంగ్రెస్ నేతలే కాదు అధిష్టానం సైతం సీరియస్ అయ్యింది.

దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.